Header Banner

లెజెండ్ బాలయ్యకు పవన్, లోకేశ్ విషెస్.. సోషల్ మీడియా వేడెక్కించిన అభిమానులు!

  Tue Jun 10, 2025 11:34        Politics

అగ్ర కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా కళకళలాడుతోంది. బర్త్‌డే సందర్భంగా ఇప్పటికే అఖండ 2’ టీజర్ రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన పొందింది. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాలకృష్ణ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆయన సినిమాల మీద ఉన్న అభిమానాన్ని, వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా స్పందించారు:
"శతాధిక చిత్రాల కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలు పోషించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఆయన.. ప్రజా జీవితంలో కూడా హిందూపురం అభివృద్ధికి నిరంతరంగా కృషి చేస్తున్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను."

నారా లోకేశ్ ట్వీట్ చేసి ఇలా తెలిపారు:
"సిల్వర్ స్క్రీన్పై ఆయన లెజెండ్… పొలిటికల్ స్క్రీన్పై ఆయన అన్‌స్టాపబుల్… ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య… నా ముద్దుల మావయ్య, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు చూపిస్తున్న స్ఫూర్తిదాయక నాయకత్వం, ప్రజల కోసం చేస్తున్న సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, శక్తిగా ఎన్నెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను."

నిర్మాణ సంస్థలు, దర్శకులు, సహ నటులు, అభిమాన సంఘాలు ఇలా అందరూ బాలకృష్ణ బర్త్‌డే వేడుకల్లో భాగం అవుతూ తమ తమ శైలిలో ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. నందమూరి అభిమానులందరూ సోషల్ మీడియా వేదికగా #HBDBalayya, #LegendBalayya వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండింగ్‌ చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనాఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారుదరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లుఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 


   #andhrapravasi #andhrapradesh #pawankalyan #lokesh #birthday #balayya #legend #social #media